సత్యసాయి: జిల్లా ఎస్పీ రత్న ఆదేశాల మేరకు శుక్రవారం పోలీసు బృందాలు జిల్లా వ్యాప్తంగా వాహనాల తనిఖీలు నిర్వహించారు. హెల్మెట్, సీట్‌బెల్ట్ తప్పనిసరిగా వినియోగించాలని, మద్యం సేవించి వాహనం నడపరాదని ప్రజలకు అవగాహన కల్పించారు. లైసెన్సులు, అవసరమైన పత్రాలు లేని వాహనదారులపై జరిమానాలు విధించి, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.