కాంగోలో ఘోర పడవ ప్రమాదం జరిగింది. వాయువ్య కాంగోలోని ఈక్వేటర్ ప్రావిన్స్‌లో ఓ పడవ బోల్తాపడి 86 మంది చనిపోయారు. బాధితుల్లో చాలా మంది విద్యార్థులు ఉన్నారని అక్కడి మీడియా తెలిపింది. పడవలో ఎక్కువ లోడ్ ఎక్కించడం, రాత్రిపూట ప్రయాణించడమే ఈ ప్రమాదానికి కారణమని అధికారులు భావిస్తున్నారు. ఈ ఘటన ఆ ప్రాంతంలో తీవ్ర విషాదాన్ని నింపింది.