NGKL: పోలీసులపై దాడి చేసిన ఓ వ్యక్తికి కల్వకుర్తి న్యాయస్థానం రెండేళ్లు జైలు శిక్షతో పాటు వేయి రూపాయల జరిమానా విధించింది. ఈ విషయాన్ని కల్వకుర్తి ఎస్సై మాధవరెడ్డి శుక్రవారం తెలిపారు. దొంగతనం కేసులో నిందితుడైన జీడిపల్లి గ్రామానికి చెందిన సైదులును అరెస్టు చేసేందుకు పోలీసులు వెళ్ళగా, అతడు పోలీసులపై దాడి చేశారు. దీంతో కోర్టు అతనికి శిక్ష ఖరారు చేసింది.