WGL: నర్సంపేట పట్టణ కేంద్రంలోని 7వ వార్డు శాంతినగర్ కాలనీలో రహదారి శిథిలమై, మట్టిరోడ్డుపై వర్షాల వల్ల గుంతలు పడి ప్రజలు నడవడానికి ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యను పరిష్కరించాలని కాలనీవాసులు శుక్రవారం ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డికి వినతిపత్రం అందజేశారు. రోడ్డు నిర్మాణం చేపట్టాలని వారు కోరారు.