MNCL: బెల్లంపల్లిలోని కేజీబీవీ పాఠశాలలో అదనపు గదులు, మూత్రశాలల నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రభుత్వం విద్యారంగాన్ని బలోపేతం చేస్తూ విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు చర్యలు తీసుకుంటుందని తెలిపారు. అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయాలని సూచించారు.