MNCL: తాడ్లపేట అటవీ రేంజ్ పరిధిలో అటవీ సిబ్బందిపై ఉద్దేశపూర్వకంగానే దాడి జరిగిందని FRO సుష్మ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. పలు ప్రాంతాల ఆక్రమణదారులు ప్రణాళికబద్ధంగా కొడవళ్లు, గొడ్డళ్లు, కర్రలతో అటవీ సిబ్బందిపై దాడి చేసి మిర్చి పొడిని అటవీ సిబ్బంది కళ్ళపై బలవంతంగా రుద్దారని తెలిపారు. నిందితులను దండేపల్లి పోలీసులు అరెస్టు చేశారన్నారు.