ADB: జిల్లాలో గంజాయిని కనుమరుగు చేయడమే లక్ష్యంగా పోలీస్ యంత్రాంగం పనిచేస్తుందని SP అఖిల్ మహాజన్ తెలియజేశారు. గుడిహత్నూర్ మండలం తోషం గ్రామ శివారులో గంజాయి మొక్కలు పండిస్తున్న తండ్రి, ఇద్దరు కొడుకులపై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. వీరిలో ఒకరిని అరెస్టు చేయగా ఇద్దరు పరారీలో ఉన్నట్లు తెలిపారు. గంజాయిని పండిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు.