NLR: నానో యూరియాను పంట ఆకులపై పిచికారి చేయడం ద్వారా మొక్కల పత్రహరితానికి నేరుగా చేరుతుందని ఏవో పి.రమేష్ నాయుడు తెలిపారు. కోపల్లె గ్రామంలో నానో యూరియాపై శుక్రవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. 45 కిలోల బస్తాలో ఉండే పోషకాలు అరలీటర్ నానో యూరియాలో ఉంటాయన్నారు. నానో యూరియా 30 నానో మైక్రాన్ల ఘనపరిమాణం ఉంటుందని, 80% శాతానికి పైగా మొక్కకు చేరుతుందని అన్నారు.