KMR: ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రైతుల పొలాల్లో ఇసుక మేటలు వేశాయి. దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి సైతం ఈ పొలాలను పరిశీలించారు. దీంతో శుక్రవారం స్పందించిన డీఆర్డీవో సురేందర్ మాట్లాడుతూ.. భారీ వర్షాలకు రైతుల పొలాల్లో ఉన్న ఇసుక మేటలను ఉపాధి హామీ పథకంలో భాగంగా కూలీల చేత తొలగింప జేస్తున్నట్లు పేర్కొన్నారు.