CTR: ప్రభుత్వం తరఫున మంజూరైన ఎస్సీ కాలేజ్ బాయ్స్, ఎస్సీ కాలేజ్ గర్ల్స్ హాస్టళ్ళ ఏర్పాటుకు అనువైన స్థలాలను పలమనేరు పట్టణంలో వెంటనే గుర్తించాలని పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆ మేరకు స్థానిక కార్యాలయంలో శుక్రవారం ఆయన హాస్టళ్ళ నిర్మాణ అంశంపై మున్సిపల్, రెవెన్యూ మరియు విద్యాశాఖా అధికారులతో సమావేశమై చర్చించారు.