MNCL: జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ITIలలో సెప్టెంబర్ 15 నుంచి 30 వరకు వాక్ ఇన్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వ ITI ప్రిన్సిపల్ రమేష్ శుక్రవారం ప్రకటనలో తెలిపారు.4వ దశ ప్రవేశాలకు అర్హులైన విద్యార్థులు నేరుగా హాజరు కావచ్చునని చెప్పారు. గతంలో దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు మళ్లీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదన్నారు.