KMM: పెండింగ్లో ఉన్న తమ వేతనాలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ హాస్టల్ కార్మికులు ధర్నా నిర్వహించారు. శుక్రవారం ఖమ్మం ఎన్ఎస్పీ క్యాంపులోని ఎస్సీ బాలుర వసతిగృహం ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో ఈ ధర్నా జరిగింది. సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు తుమ్మ విష్ణువర్ధన్ మాట్లాడుతూ.. హాస్టల్ కార్మికులకు కనీస వేతనం రూ.26,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు.