MDK: తూప్రాన్ మండలం ఘనపూర్ గ్రామంలో బీహార్ రాష్ట్రానికి చెందిన సందీప్ కుమార్ (16) అదృశ్యమైనట్టు ఎస్సై శివానందం తెలిపారు. సందీప్ కుమార్ తండ్రి మనోజ్ కుమార్ ఘనపూర్ శివారులోని ప్రోలాన్ సీడ్ కంపెనీలో మేస్త్రిగా పనిచేస్తున్నట్లు వివరించారు. 8న మనోజ్ మార్కెట్ కి వెళ్ళగా, సందీప్ కనిపించకుండా పోయినట్లు తెలిపారు.