మహబూబ్నగర్ రూరల్ మండలం కోడూరు గ్రామంలో శుక్రవారం నిర్వహించిన కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ కార్యక్రమానికి పాలమూరు యూనివర్సిటీ విద్యార్థులు శుక్రవారం తరలి వెళ్లారు. యూనివర్సిటీ విద్యార్థులు కోడూరు గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాన్ని, గ్రామపంచాయతీని, పాఠశాలను సందర్శించి భోజన వసతులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ శ్రీకాంత్, తదితరులు ఉన్నారు.