MNCL: ప్రజల నుండి వివిధ సమస్యలపై వచ్చే అర్జీలను వెంటనే పరిష్కరించాలని మంచిర్యాల జిల్లా జాయింట్ కలెక్టర్ పి.చంద్రయ్య సూచించారు. గురువారం జన్నారంలోని తాసిల్దార్ కార్యాలయాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పలు రికార్డులను పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ రాజ మనోహర్ రెడ్డి, డిటి రామ్మోహన్ పాల్గొన్నారు.