VSP: ఆటో కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ.. ఏపీ ఆటో డ్రైవర్స్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు షేక్ రెహమాన్, ప్రధాన కార్యదర్శి కాసు బాబు శుక్రవారం విశాఖ దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజుకు వినతిపత్రం అందజేశారు. స్త్రీ శక్తి పథకం వల్ల ఉపాధి దెబ్బతిన్నని ఆవేదన వ్యక్తం చేశారు. ఆటో కార్మికులకు ప్రతినెల రూ.5,000 ఇవ్వాలని కోరారు.