ADB: జిల్లా కలెక్టరేట్ కార్యాలయాన్ని 1952లో నిర్మించారని కలెక్టర్ రాజర్షిషా తెలిపారు. ఇన్ని సంవత్సరాలు ఎలాంటి సమస్య లేకుండా.. చిన్నచిన్న మరమ్మతులతో కొనసాగిందన్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఏ సెక్షన్, బీ సెక్షన్ భవనం కూలిందన్నారు. నిపుణుల కమిటీ పర్యవేక్షిస్తున్నారని.. వారిచ్చిన నివేదిక ప్రకారం భవనంపై చర్యలు తీసుకుంటామన్నారు.