అన్నమయ్య: ప్రభుత్వ భూమిని కాపాడాలని పోరాటం చేసిన సీపీఐ నాయకుడి మీద దాడి చేసిన వారిపై కేసు నమోదు చేయాలని CPI నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఇవాళ మదనపల్లె సబ్ కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. వారు మాట్లాడుతూ.. పుల్లంపేట మండలం, కేతరాజు పల్లిలో సర్వే నెంబర్ 205లో కొంతమంది భూమి కబ్జా చేస్తుంటే సీపీఐ నాయకుడు సెల్వకుమార్ అడ్డుకోవడం జరిగిందన్నారు.