SKLM: గొర్రిబంద పంచాయతీ పరిధి కోనవానిపేట గ్రామంలో ఇటీవల నిర్మించిన మినీ గోకులం షెడ్‌పై పలు ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఉపాధి హామీ ఎపీడీ లోకేష్ శుక్రవారం స్వయంగా పరిశీలించారు. ఒక షెడ్‌పై రెండు బిల్లు ఇచ్చారని గ్రామస్తులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు స్వయంగా దర్యాప్తు చేశారు. దీనిపై పూర్తి విచారణ జరిపి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.