ఉపరాష్ట్రపతి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రాహుల్ గాంధీ గైర్హాజరు కావడంపై బీజేపీ జాతీయ ప్రతినిధి ప్రదీప్ భండారీ విమర్శలు చేశారు. రాహుల్కు రాజ్యాంగం, ప్రజాస్వామ్యం అంటే ద్వేషమని ‘X’ లో పేర్కొన్నారు. ఇటీవల స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలనూ రాహుల్ బహిష్కరించారని, ప్రస్తుతం మలేషియాలో విహరిస్తున్నారని ఇలాంటి వ్యక్తి ప్రజా జీవితంలో ఉండటానికి అర్హుడా? అని ప్రశ్నించారు.