CTR: అధికారులు ప్రజా సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని మేయర్ ఎస్. అముద చెప్పారు. శుక్రవారం లక్ష్మీ నగర్ కాలనీలోని ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ వారి కార్యాలయం ప్రజాదర్బార్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. వివిధ సమస్యలపై ప్రజలు సమర్పించిన వినతులను కమిషనర్ నరసింహ ప్రసాద్ పరిశీలించారు.