TG: సింగరేణి సంస్థకు అదనంగా రావాల్సిన బొగ్గు బ్లాకులు దక్కడం లేదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. కొత్త బ్లాకులు కేటాయించకపోవడంతో.. సింగరేణి సంస్థ ఇబ్బందులు ఎదుర్కొంటోందన్నారు. కర్ణాటకలో రాగి, బంగారం గనుల తవ్వకాల వేలంలో సింగరేణి సంస్థ పాల్గొందన్నారు. రాగి, బంగారం మైనింగ్ ను ఏ సంస్థ చేసినా.. సింగరేణికి 37.75 శాతం వాటా దక్కుతుందన్నారు.