ATP: ఢిల్లీలో QCI ఆధ్వర్యంలో ఈనెల 15న జరిగే సర్పంచుల సమావేశానికి తాను ఎంపికైనట్లు వజ్రకరూర్ సర్పంచ్ మోనాలిసా తెలిపారు. గ్రామాల్లో తాగునీరు, పారిశుద్ధ్య సమస్యలపై అవగాహన కార్యక్రమాలు ఉంటాయని, వాటిని ఎలా అధిగమించాలన్న అంశాలపై చర్చిస్తారని పేర్కొన్నారు. ఎంపిక కావడం సంతోషంగా ఉందన్నారు.