VZM: కొత్తవలస మండలం చింతలపాలెం గ్రామంలో ఏరువాక కేంద్రం విజయనగరం ఆధ్వర్యంలో ఎస్సీ ఉప ప్రణాళికలో భాగంగా రైతు శిక్షణా కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా 30 మంది రైతులకు జీవ ఎరువులు వంద శాతం సబ్సిడీతో అందచేశారు. ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త డా లక్ష్మణ్ మాట్లాడుతూ.. నానో యూరియా, జీవ ఎరువులు వాడకంవలన కలిగే ప్రయోజనాలను తెలిపారు.