NLG: ఉమ్మడి నల్గొండ జిల్లాలోని మహిళా స్వయం సహాయక సంఘాలకు నల్గొండ DCCB గుడ్ న్యూస్ చెప్పింది. వాణిజ్య బ్యాంకుల కంటే తక్కువ వడ్డీకే రుణాలు ఇవ్వనుంది. ఇప్పటివరకు మహిళా సంఘాలు తీసుకునే రుణాలపై వాణిజ్య బ్యాంకులు 11.5 శాతం నుంచి 12 శాతం వరకు ఒక్కో బ్యాంకు ఒక్కో రకంగా వడ్డీ వేస్తున్నాయి. అయితే మొదటిసారిగా డీసీసీబీ ఆయా సంఘాలకు 7 శాతం 10 శాతంలోపు వడ్డీకి రుణాలను ఇస్తున్నారు.