నందమూరి బాలకృష్ణ, దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబోలో మరో మూవీ రాబోతుంది. ‘NBK 111’ వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కనున్న ఈ మూవీ ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఈ సినిమాను దసరా కానుకగా ప్రారంభించడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. చరిత్రను, వర్తమానాన్ని ముడిపెట్టి ఓ ఎపిక్ కథతో దీన్ని తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది.