NZB: సెర్ప్ గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (హైదరాబాద్) అధికారులు శుక్రవారం ఆర్మూరు మండలంలోని ఫతేపూర్ గ్రామాన్ని సందర్శించారు. మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా మహిళా సంఘాల సభ్యులు రుణాలు తీసుకుని మల్టీ ఫార్మింగ్ ద్వారా చేపడుతున్న డెయిరీ, చేపల పెంపకం, కూరగాయల సాగు, దేశీ కోళ్ల పెంపకం యూనిట్లను సందర్శించారు.