ప్రకాశం: మరిపూడి మండలం రేగులగడ్డ గ్రామంలో శనివారం భార్యపై అనుమానంతో భర్త ఆమె గొంతు కోసి హత్య చేశాడు. అనంతరం భర్త కూడా తన గొంతు కోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. కాగ దీనిపై పూర్తి వివరాలు విచారణలో వెల్లడికానున్నాయి.