SRD: సిర్గాపూర్ మండలం గౌడగాం చౌరస్తా వెళ్లే రోడ్డులో ప్రమాదకరమైన మూల మలుపులు ఉన్నాయి. అంతేకాదు ఈ మార్గంలో ఎత్తయిన గుట్టలు ఎక్కి, దిగాల్సి ఉంటుంది. అయితే రోడ్డు టర్నింగ్లో స్పీడ్ బ్రేకర్లు, ప్రమాద సూచికలు మాత్రం లేవు. దీంతో వాహనదారులు అతివేగంతో మలుపుల వద్ద అదుపుతప్పి ప్రమాదబారిన పడుతున్నారు. ప్రమాద సూచికలు, స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.