మేడ్చల్ SOT, దుండిగల్ పోలీసులు సంయుక్తంగా జరిపిన దాడిలో బయో డీజిల్ అక్రమ రవాణాకు పాల్పడుతున్న ముఠా పట్టుబడింది. నెల్లూరు నుంచి అక్రమంగా తీసుకువచ్చిన 15,000 లీటర్ల బయోడీజిల్, 4 ట్యాంకర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆపరేటర్ సాయితో పాటు నలుగురు డ్రైవర్లను అరెస్టు చేశారు. దీని విలువ రూ.68.80 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.