VKB: మిషన్ భగీరథ పైప్లాన్ మరమ్మతుల కారణంగా శనివారం జిల్లాలో నీటి సరఫరా ఉండదని మిషన్ భగీరథ ఈఈ చలమారెడ్డి తెలిపారు. వికారాబాద్, తాండూరు, పరిగి, కొడంగల్ మున్సిపాలిటీలతో పాటు పలు గ్రామాలకు నీటి సరఫరా నిలిచిపోతుందని పేర్కొన్నారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి నీటిని పొదుపుగా వాడుకోవాలని సూచించారు.