SRD: జహీరాబాద్లోని రంజోల్ పాలిటెక్నిక్ కళాశాలలో ఈనెల 16, 17 తేదీల్లో కబడ్డీ జిల్లా స్థాయి పోటీలు నిర్వహిస్తున్నట్లు SGF జిల్లా కార్యదర్శి శ్రీనివాసరావు శనివారం తెలిపారు. అండర్- 14, 17 పోటీలు జరుగుతాయని పేర్కొన్నారు. 16న బాలురు, 17న బాలికలకు జిల్లా స్థాయి పోటీలు జరుగుతాయని చెప్పారు. పూర్తి వివరాలకు 99891 63793, 99892 18299 నెంబర్లకు సంప్రదించాలన్నారు.