ప్రకాశం: టంగుటూరు మండలం తూర్పు నాయుడుపాలెంలో లబ్ధిదారులకు రూ.22 లక్షల విలువైన CMRF చెక్కులను మంత్రి స్వామి శనివారం పంపిణీ చేశారు. అనంతరం మంత్రి స్వామి మాట్లాడుతూ.. అన్ని వర్గాల సంక్షేమానికి సీఎం చంద్రబాబు పాటుపడుతున్నారని అన్నారు. అందుకే ఆటో డ్రైవర్లకు దసరా నాడు రూ.15 వేల ఆర్థిక సాయం అందిస్తామన్నారని పేర్కొన్నారు.