NZB: నగరంలోని అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఈనెల 26 వరకు ఎలాంటి అపరాధ రుసుము లేకుండా ప్రవేశాలు పొందవచ్చని కో-ఆర్డినేటర్ రంజిత శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. బీకాం, బీఎస్సీ, ఎంఏ, ఎంకాం, ఎంఎస్సీ ఎంబీఏ కోర్సులు అందుబాటులో ఉన్నాయన్నారు. ఆసక్తి గలవారు దరఖాస్తులు చేసుకోవాలన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.