కృష్ణా: చల్లపల్లిలో శనివారం ‘స్వచ్ఛ సుందర చల్లపల్లి’ కార్యక్రమం జరిగింది. స్వచ్ఛ కార్యకర్తలు స్థానిక జాతీయ రహదారి-216కి ఇరువైపులా పేరుకుపోయిన చెత్త, వ్యర్థాలను తొలగించారు. ఈ కార్యక్రమ కన్వీనర్లు డాక్టర్ దాసరి రామకృష్ణ ప్రసాద్, డాక్టర్ తరిగోపుల పద్మావతి దంపతుల ఆధ్వర్యంలో నాటిన మొక్కలను ట్రిమ్మింగ్ చేసి పాదులు చేశారు.