KDP: పులివెందుల మండలం యర్రబల్లెకు చెందిన కౌలు రైతు రాములు (55) అప్పుల బాధ తాళలేక పురగులమందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొంతపొలాన్ని కౌలుకు తీసుకుని అరటి సాగు చేశారు. దిగుబడులు సరిగా రాకపోవడం, అనారోగ్య సమస్య వేధిస్తుండటంతో మనస్తాపానికి గురయ్యారు. దీంతో శుక్రవారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగి చనిపోయాడు.