NRML: శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ (SRSP) నిండుకుండలా ఉప్పొంగుతోంది. శనివారం ఉదయం నీటిమట్టం పూర్తి స్థాయి 1091 అడుగులకు చేరి, నిల్వ 80.501 TMCగా నమోదైంది. ప్రాజెక్టుకు 1,08,855 క్యూసెక్కుల ఇన్‌ఫ్లోలు వచ్చి, అంతే పరిమాణంలో అవుట్‌ఫ్లోలు విడుదల అవుతున్నాయి. 23 స్పిల్‌వే గేట్ల ద్వారా 91,140 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు తెలిపారు.