NRML: కడెం నారాయణ రెడ్డి ప్రాజెక్టు వద్ద జలస్థాయి శనివారం ఉదయం 698.275 అడుగులకు చేరుకుందని ప్రాజెక్ట్ అధికారులు తెలిపారు. మొత్తం సామర్థ్యం 4.699 టీఎంసీలలో 4.269 టీఎంసీలు నిల్వ ఉందని, ప్రాజెక్టుకు 8,827 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుండగా, ఒక గేటు ద్వారా 6,391 క్యూసెక్కుల మిగులు నీటిని విడుదల చేస్తున్నట్లు పేర్కొన్నారు