JN: పల్లె నిద్ర కార్యక్రమంలో భాగంగా బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు పెరుమాండ్ల వెంకటేశ్వర్లు జఫర్గడ్ మండలం కునూరు గ్రామంలో శుక్రవారం రాత్రి బస చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పోతోజు ఎల్లచారి, బీజేపీ ముఖ్య నాయకులున్నారు.