ATP: గుండెపోటుతో మృతి చెందిన వైసీపీ సీనియర్ నేత తోపుదుర్తి భాస్కర్ రెడ్డి భౌతిక కాయానికి మాజీ ఎమ్మెల్యేలు కేతిరెడ్డి పెద్దారెడ్డి, వెంకటరామిరెడ్డి శనివారం నివాళి అర్పించారు. భాస్కర్ రెడ్డి మృతి తమ పార్టీకి తీరనిలోటని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం తోపుదుర్తి కుటుంబ సభ్యులను వారు పరామర్శించి సంతాపం ప్రకటించారు.