కృష్ణా: పెడన మున్సిపల్ పరిధిలోని కొత్త చెరువు, తామర చెరువు, మల్లి చెరువులకు బహిరంగ వేలం పాట సెప్టెంబర్ 17న ఉదయం 11 గంటలకు నిర్వహించనున్నట్లు మున్సిపల్ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. అదే రోజు మున్సిపాలిటీకి చెందిన వాణిజ్య సముదాయాలకు కూడా వేలం ఉంటుందని పేర్కొన్నారు. ఆసక్తి ఉన్నవారు నిర్ణీత సమయానికి హాజరై వేలంలో పాల్గొనాలని కమిషనర్ సూచించారు.