అన్నమయ్య: నందలూరు మండలం నాగిరెడ్డిపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని ఇసుకపల్లి అంగన్వాడీ కేంద్రంలో పిల్లలకు నాసిరకమైన గుడ్లు పంపిణీ చేశారు. దీనిపై ప్రశ్నించిన తల్లిపై అంగన్వాడీ కార్యకర్త అవాకులు, చవాకులు చేసి బెదిరించినట్లు బాధితులు పేర్కొన్నారు. దీంతో సూపర్వైజరుకు ఫిర్యాదు చేసినా సరైన స్పందన రాక, ఆమె కార్యకర్తకు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది.