ATP: గుంతకల్లు పట్టణంలోని రాజేంద్రనగర్లో గల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం స్వామి వారికి విశేష పూజలు నిర్వహించారు. పవిత్ర గంగా జలాలతో అభిషేకాలు నిర్వహించారు. అనంతరం బంగారు, వెండి, ఆభరణాలతో పాటు ప్రత్యేక పుష్పాలతో అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామి వారిని దర్శించుకున్నారు.