ప్రకాశం: ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, జిల్లా ఉపాధి కార్యాలయం సంయుక్త ఆధ్వర్యంలో సెప్టెంబర్ 19న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్య అభివృద్ధి అధికారి రవితేజ తెలిపారు. ఈ మేరకు మార్కాపురం జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత బాలికల ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న ఈ జాబ్ మేళాలో 18 ఏళ్ల నుంచి 30 ఏళ్లలోపు ఆసక్తి కలిగిన నిరుద్యోగులు పాల్గొనాలని కోరారు.