HYDలో ఓ టైలర్ తన మొబైల్లో APK ఫైల్ క్లిక్ చేసిన క్షణాల్లో అకౌంట్లో నుంచి రూ. 95,239 మాయం అయ్యాయి. RTO CHALLAN పేరిట ఏపీకే ఫైల్ రావడంతో దాన్ని క్లిక్ చేయగానే, వ్యక్తిగత వివరాలు, బ్యాంకు సంబంధిత వివరాలను మొత్తం సైబర్ నేరగాళ్లు పట్టేసి, ఆన్లైన్ ఆర్డర్ చేసినట్లు తెలిపారు. దీనిపై ఫైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, డబ్బు తిరిగి వచ్చేలా చేశారు.