గుంటూరు జిల్లా కాకుమానులో ఉన్న అంబేడ్కర్ ఎస్సీ బాలికల గురుకుల పాఠశాలకు శనివారం మధ్యాహ్నం 3 గంటలకు కేంద్ర సహాయక శాఖా మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు రానున్నారు. వారు పాఠశాలలోని మౌలిక వసతులు, ఆట మైదానాన్ని పరిశీలించి, అధికారులతో చర్చించనున్నారు. అనంతరం మట్లూరులో జరిగే వినాయక ఉత్సవాలలో కూడా వారు పాల్గొంటారు.