E.G: 92వ దసరా ఉత్సవాలకు రాజమండ్రి దేవీ చౌక్ రెడీ అవుతుంది. కర్ణాటకలోని మైసూరు దసరా ఉత్సవాలకు, కలకత్తా కాళీమాత ఆరాధనలకు దీటుగా నిలుస్తుంది గోదావరీ తీరాన దేవీ చౌక్ వేడుక. దసరా ఉత్సవాల సమయంలో వేలాదిమంది అమ్మవారిని దర్శించుకుంటారు. కాగా, ఈ ఏడాది సెప్టెంబర్ 21 నుంచి శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం అవుతున్నాయి.