GNTR: ప్రత్తిపాడు ఆర్టీసీ బస్టాండ్ వద్ద రహదారికి శనివారం అధికారులు మరమ్మతులు చేపట్టారు. ఈ మేరకు ఆర్ అండ్ బి ఏఈ. సాయి కృష్ణ మరమ్మతు పనులను దగ్గరుండి చేయిస్తున్నారు. రహదారిపై ఏర్పడిన గుంతలను గ్రావెల్‌తో నింపుతున్నారు. మరమ్మతు పనులు చేస్తుండటంతో స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రహదారికి త్వరలో శాశ్వత పరిష్కారం కూడా చూపాలని ప్రజలు కోరుతున్నారు.