E.G: జిల్లా మెజిస్ట్రేట్ & కలెక్టర్గా కీర్తి చేకూరి శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రజా ప్రతినిధులు, అధికారుల సమన్వయంతో జిల్లాను అగ్రగామిగా నిలిపేందుకు కృషి చేస్తానన్నారు. బాధ్యతలు చేపట్టిన సందర్భంలో వివిధ శాఖల అధికారులు, కలెక్టరేట్ అధికారులు సిబ్బంది నూతన కలెక్టర్కు అభినందనలు తెలియజేశారు.