TPT: గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన ఘటన తిరుపతి రుయా ఆస్పత్రి ప్రాంగణంలో శుక్రవారం చోటుచేసుకుంది. మృతుడు 55 ఏళ్లు వయసు కలిగి ఉంటాడని పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని రుయా మార్చురీకి తరలించారు. ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో గుర్తు తెలియని వ్యక్తిగా పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం మృతుడిని ఎవరైనా గుర్తిస్తే తిరుపతి వెస్ట్ పోలీసులను సంప్రదించాలని కోరారు.